Viral News : ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తే.. ప్రాణం పోయినంత పనైంది..!
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం జలపాతం మధ్యలోకి వెళ్లిన ఓ జంట ఊహించని ప్రమాదంలో పడింది. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడింది.

Viral News
Viral News : పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. పెళ్లికి ముందే..లక్షల్లో ఖర్చు పెట్టి మరీ.. ఈ ఫోటోలు, వీడియోలు చేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. పెళ్లికంటే ఈ షూట్‌ల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కపుల్స్. వీటికోసం తెలియని ప్రదేశాలకు వెళుతున్నారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇలాంటివి చేయడం ఓకే.. కానీ కొందరు కపుల్స్ మాత్రం ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ద్వారా రిస్క్‌లో పడుతున్నారు. ఫోటోల కోసం కొండలు గుట్టలు ఎక్కుతూ ప్రమాదాల కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఇటువంటిదే ఓ ఘటన జరిగింది.
చదవండి : Kajal Aggarwal Pre-Wedding: మెహందీతో మెరిసిపోతుంది!
ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగంగా ఓ జంట నజలపాతం మధ్యలోకి వెళ్లి రాళ్లపై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇదే సమయంలో జలపాతంపై ఉన్న డ్యామ్ గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో వధూవరులు నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయారు. చిత్తోర్‌గఢ్‌లోని రావత్‌భటా ప్రాంతంలో చులియా జలపాతం వద్ద ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వధూవరులతో, పాటు పక్కన సహాయం చేసేందుకు ఉన్న మరో ఇద్దరు జలపాతం మధ్యలో ఓ రాయిపై ఉండిపోయారు.
ప్రమాదాన్ని ముందు పసిగట్టిన ఫోటోగ్రాఫర్ వారిని బయటకు రావాలని వారించాడు, అయితే వారు అతడి మాటలు పాటించుకోకుండా అక్కడే ఉండిపోయారు. కొన్ని సెకండ్ల వ్యవధిలో వారు నిల్చున్న బండ చుట్టూ నీరు చేసిపోయింది. జలపాతం నుంచి బయటకు వచ్చిన ఫోటోగ్రాఫర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందం ఘటన స్థలికి చేరుకొని దాదాపు మూడు గంటల పాటు శ్రమించి కాబోయే దంపతులను కాపాడారు.
చదవండి : Beer Boy in Wedding : పెళ్లిలో బీర్ బాయ్ సందడి..అతిథులు దిల్ ఖుష్
కాగా “రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ గేట్లను మంగళవారం ఉదయం తెరిచారు. ఫలితంగా, కోటకు చెందిన ఆశిష్ గుప్తా (29) అతడికి కాబోయే భార్య శిఖా (27) ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రాళ్ల వద్దకు చేరుకోవడంతో చులియా జలపాతంలో నీటి ప్రవాహం తీవ్రమైంది. వారితో పాటు వారి స్నేహితుడు హిమాన్షు (22), బాలిక మేనకోడలు మిలన్ (18) ఉన్నారు. నలుగురూ నీటిలోకి దిగారు’’ అని ఆ ప్రాంత ఎస్‌హెచ్‌ఓ రాజారామ్ గుర్జర్ చెప్పారు. ప్రమాదాన్ని ముందే ఊహించిన ఫోటోగ్రాఫర్ బయటపడ్డాడని, ఇదే సమయంలో తన కెమెరా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని తెలిపారు.