Covaxin: వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు 30 రోజుల్లో 30 నగరాలకు

దేశమంతా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వ్యాక్సిన్ కొరత కారణంగా నిదానించింది. కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయింది. ఆ కొరత తీర్చేందుకు భారత్ బయోటెక్.. 30 రోజుల్లో 30 నగరాలకు కొత్త షిప్‌మెంట్స్ పంపించామని చెప్పింది.

Covaxin: వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు 30 రోజుల్లో 30 నగరాలకు

Covaxin

Updated On : May 25, 2021 / 3:08 PM IST

Covaxin: దేశమంతా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వ్యాక్సిన్ కొరత కారణంగా నిదానించింది. కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయింది. ఆ కొరత తీర్చేందుకు భారత్ బయోటెక్.. 30 రోజుల్లో 30 నగరాలకు కొత్త షిప్‌మెంట్స్ పంపించామని చెప్పింది.

’30రోజుల్లోపే కొవాగ్జిన్ 30 నగరాలకు చేరింది. ఉద్యోగులంతా కమిట్మెంట్ తో పనిచేశారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశానికి ఇమ్యూనిటీ ఇవ్వాలని 24గంటలూ శ్రమించారు. వాళ్లు మంచిగా ఉండాలని దేవుడ్ని కోరుకోండి. వారిలో కొందరు క్వారంటైన్ లోనే ఉన్నారు’ అని జాయింట్ మేనేజింగ్ డైరక్టర్, కో ఫౌండర్ సుచిత్ర ఎల్లా అన్నారు.

గత వారమే భారత్ బయోటెక్ ప్రొడక్షన్ పెరిగే దిశగా ప్లాన్ చేస్తూ గుజరాత్ లో ప్లాంట్ పెట్టాలని చూస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం.. సంవత్సరానికి 200మిలియన్ డోసులు ప్రొడక్షన్ చేయగలమని కంపెనీ చెప్పింది.

కొవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడే క్రమంలో.. వ్యాక్సినేషన్ డ్రైవ్ ను స్పీడప్ చేసింది ఇండియా. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల అవసరం ఉండటంతో చాలా రాష్ట్రాలు కొరతను ఎదుర్కొంటున్నాయి.

ఢిల్లీ, పంజాబ్ లు వ్యాక్సిన్ల కొరత ఉందని నేరుగా అమెరికాకు చెందిన ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ లు తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నించారు. నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడతామని వాళ్లు చేసిన రిక్వెస్ట్ ను తిప్పికొట్టేశాయి ఆ వ్యాక్సిన్ సంస్థలు.

కొవాగ్జిన్ వ్యాక్సిన్ B.1.167 వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఇండియా, యూకే సంస్థలు స్టడీ చేసి ఫలితాలిచ్చాయి.