అటు మహా తుఫాన్.. ఇటు నుంచి బుల్‌బుల్ తుఫాన్

మహారాష్ట్రను ముంచేసేందుకు మహా తుఫాన్ వచ్చేస్తోంది. గురువారం గుజరాత్ లోని సౌరాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధవారం మహా తుఫాన్ 810కిలోమీటర్ల దూరం వరకూ పొంచి ఉంది.భారత తూర్పు తీరంలో అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. మధ్య మహారాష్ట్ర, థానె, పల్ఘార్ జిల్లాల్లో మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో బలహీనపడిన మహాతుఫాన్ అధిక పీడనంగా మారనుంది. బుధవారం సాయంత్రం నాటికి డయ్యూ నైరుతి వైపుకు 180కిలోమీటర్ల దూరంలో తుఫాన్ వ్యాపించి ఉంది. ఆ తర్వాత డయ్యూలోని తుర్పు నైరుతి వైపుకు పయనిస్తుంది.
ఒడిశాలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 730కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్‌బుల్ తుఫాన్ వేగంగా పయనిస్తుంది. ఉత్తరంగా వాయువ్య దిశగా ప్రయాణించే క్రమంలో వేగం పుంజుకోనుంది. తీరం దాటే సమయంలో 30 నుంచి 40కిలో మీటర్ల మేర బలంగా గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అరేబియా సముద్రంలోని పీడనం కారణంగా మహా తుఫాన్ ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయి. బంగాళ ఖాతంలోని పీడనం కారణంగా బుల్ బుల్ తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.