జార్ఖండ్ స్టేట్ టాపర్‌గా టైలర్ కూతురు.. జర్నలిస్ట్ కావడమే ఆశయం..

  • Published By: vamsi ,Published On : July 20, 2020 / 07:00 AM IST
జార్ఖండ్ స్టేట్ టాపర్‌గా టైలర్ కూతురు.. జర్నలిస్ట్ కావడమే ఆశయం..

Updated On : July 20, 2020 / 10:21 AM IST

జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్(JAC) బోర్డ్ ఇంటర్ ఆర్ట్స్ స్టేట్ బోర్డ్ టాపర్‌గా నందిత హరిపాల్ నిలిచారు. 12వ తరగతి పరీక్షల్లో స్టేట్ టాపర్ నందితను విష్టుపూర్ పోస్ట్ ఆఫీస్ తన ఫోటోను కలిగి ఉన్న తపాలా స్టాంపును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

ఈ సంవత్సరం ఆర్ట్స్ స్ట్రీమ్‌లో మొదటి స్థానం దక్కించుకోవడం ద్వారా నందిత హరిపాల్ తన తల్లిదండ్రులను గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నందిత తండ్రి టైలర్‌గా ఉన్నారు. తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. భవిష్యత్తులో జర్నలిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు నందిత న్యూస్ ఏజెన్సీ ANIకి వెల్లడించింది.

ఈ సంవత్సరం సైన్స్‌లో 58.99%, ఆర్ట్స్‌లో 82.53% మరియు వాణిజ్యంలో 77.37% తో ఆమె ఉత్తీర్ణత సాధించింది. ఈ సంధర్భంగా నందిత మాట్లాడుతూ.. “ఈ వార్త విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. నేను రాష్ట్ర పరీక్షలో అగ్రస్థానం సాధిస్తానని ఊహించలేదు.” అని అన్నారు. “నేను క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యాను, ఒక్క తరగతిని కూడా మిస్ కాలేదు. దీనితో నేను టైమ్ టేబుల్ తయారు చేసుకుని అనుసరించాను. నేను భవిష్యత్తులో జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నా చదువులకు సరిపడా డబ్బు నా కుటుంబానికి లేదు, అయినా కూడా వారు నా విద్యకు అంతరాయం కలిగించలేదు.. ” అని ఆమె అన్నారు.

తన కుమార్తె విజయానికి సంబంధించి, ఆమె తండ్రి రాజేష్ హరిపాల్ మాట్లాడుతూ, “నేను ఆమె చదువును కొనసాగించడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టను” అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులో ముందుంచాలి అంటే వారిని ఒత్తిడి చేయకూడదు. ఈ రోజు నేను నా కుమార్తెను చూసి గర్వపడుతున్నాను.” అని అన్నారు.