Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్.. అధ్యయనానికి డీసీజీఐ అనుమతి
భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది.

Vaccine
Vaccine Mixing భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఈ అధ్యయనం నిర్వహించనుంది. ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం..వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడం.
కాగా,జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ ఈ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు.. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్‌ల మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఫేజ్ -4 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని CDSCO నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
READMixing COVID Vaccines : వ్యాక్సిన్ మిక్సింగ్.. ఇదో డేంజరస్ ట్రెండ్ : WHO వార్నింగ్!