Defence Minister : లేహ్ లో పర్యటిస్తున్న రాజ్ నాథ్..మాజీ సైనికులు,LAHDC ప్రతినిధులతో భేటీ

మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

Defence Minister : లేహ్ లో పర్యటిస్తున్న రాజ్ నాథ్..మాజీ సైనికులు,LAHDC ప్రతినిధులతో భేటీ

Rajnath Singh

Updated On : June 27, 2021 / 4:45 PM IST

Defence Minister మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. ఆర్మీ సైనికులు, మాజీ సైనికుల పట్ల తమ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందని..వన్ ర్యాంక్-వన్ పెన్షన్ ప్రకటించడం ద్వారా సైనికులకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకుని తన నిబద్ధతను చాటుకున్నారని రాజ్​నాథ్ సింగ్​ తెలిపారు. మాజీ సైనికులకు పునరావాసం సమస్యలను కూడా పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నామన్నారు.

సైన్యంలో విశిష్ఠ సేవలందించిన అనంతరం వారు ఉన్నతంగా స్థిరపడేందుకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని​ స్పష్టం చేసిన రాజ్ నాథ్..డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్​మెంట్​ ద్వారా సైన్యంలో ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు. వీటిలో అనుభవజ్ఞులకు, విశ్రాంత సైనికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పనిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ భద్రత పట్ల మీరంతా శ్రద్ధ వహించినట్లుగానే.. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత, లక్ష్యం మా ప్రభుత్వానిది.. సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇక,కార్గిల్,లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్స్(LAHDC)కి ఎన్నికైన ప్రతినిధులను,స్థానిక అధికార యంత్రాంగాన్ని కూడా రాజ్ నాథ్ ఇవాళ కలిసి..వివిధ అంశాలపై వారితో మాట్లాడారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం తర్వాత భారత్- చైనా.. ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో నుంచి దళాలు, ట్యాంకులు, ఇతర సామగ్రిని ఉపసంహరించుకున్న అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాజ్ నాథ్.. తూర్పు లడఖ్‌లో అధిక ఎత్తులో ఉన్న సైనిక స్థావరాలు, నిర్మాణాలను సమీక్షిస్తారని, వాస్తవ నియంత్రణ రేఖ వెంట మోహరించిన సైనికుల మనోధైర్యాన్ని పెంచుతారని సైనికా వర్గాలు తెలిపాయి. బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిన పలు నిర్మాణరంగ ప్రాజెక్టులను కూడా రాజ్ నాథ్ ప్రారంభించనున్నారు.

ఇక,గత ఏడాది మే నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతను పరిష్కరించడానికి రెండు రోజుల క్రితం భారత-చైనా దౌత్యవేత్తల మధ్య సరికొత్త చర్చలు జరిగిన విషయం తెలిసిందే. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని చర్చల ద్వారా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.