శ్రీలంకలో ఇండియన్ జర్నలిస్ట్ అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 07:52 AM IST
శ్రీలంకలో ఇండియన్ జర్నలిస్ట్ అరెస్ట్

Updated On : May 3, 2019 / 7:52 AM IST

శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్‌ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్కూల్లోకి అధికారులతో మాట్లేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఆయనను లంక పోలీసులు అరెస్టు చేశారు. ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్ధి చనిపోయాడనీ.. అతడి గురించి వివరాలు తెలుసుకునేందుకు సిద్దిఖి లోపలికి వెళ్లబోయారని, అనుమతి లేకుండా చొరబాటుకు ప్రయత్నించిన అభియోగాలపై సిద్దిఖి అరెస్ట్ అయ్యారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ నెల 15 వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారని అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.ఏప్రిల్-21,2019న కొలంబోలో  లగ్జరీ హోటళ్లు, చర్చిలు టార్గెట్ గా ఐసిస్ జరిపిన వరుస బాంబ్ బ్లాస్ట్ లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 500మందికి పైగా తీవ్ర గాయాలపాలై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.