Delhi Air Pollution : ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం…నేడు అత్యవసర సమావేశం

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....

Delhi Air Pollution : ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం…నేడు అత్యవసర సమావేశం

Delhi Air Pollution

Updated On : November 3, 2023 / 11:38 AM IST

Delhi Air Pollution : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కర్వా చౌత్ పండుగ సందర్భంగా పటాకులు కాల్చడంతో ఢిల్లీలోని ప్రజలకు గాలి పీల్చుకోవడం కష్టతరంగా మారింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి 400 మార్కును దాటింది. దీంతో ఆప్ ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీ సచివాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

పెరిగిన వాయుకాలుష్యం

శుక్రవారం ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 460 వద్ద నమోదైంది.ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కి చేరుకోవడంతో ఢిల్లీలో పొగమంచు పెరిగింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. గోపాల్ రాయ్ కాలుష్య నియంత్రణకు మరిన్ని ఆంక్షలు విధించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాత డీజిల్ వాహనాలు,జనరేటర్ల వినియోగం నిలిపివేశారు.

నిర్మాణపనులు నిలిపివేత

అత్యవసరం కానీ నిర్మాణపనులు నిపిపివేశారు. ఢిల్లీలో చలికాలం ప్రారంభంలోనే తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్య ప్రభావం పెరిగింది. వాయు కాలుష్యం కారణంగా కళ్ళు మంటలు, కళ్ళ నుంచి నీళ్లు కారడం,గొంతు నొప్పి, తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న ఆంకాలజీ డాక్టర్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ప్రభుత్వాలకు వైద్యులు సూచనలు చేశారు.

పంట వ్యర్థాల దహనంతో…

గాలి నాణ్యత లోధి రోడ్ లో 324 ,గురు గ్రామ్ లో 349,నోయిడాలో 388,ఢిల్లీ యూనివర్సిటీలో 377,ఢిల్లీ విమానాశ్రయంలో 371 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిలిచింది. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై నీటిని చల్లడం,బయోమాస్ కాల్చకుండా చూడటం సహా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆప్ విమర్శలు గుప్పించింది. యూపి,హర్యానా,రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు,పంట వ్యర్ధాల దహనం తో కాలుష్యం తీవ్రత పెరుగుతుందని ఆప్ ఆరోపించింది.

డీజిల్ బస్సులపై నిషేధం

ఇప్పటికే ఢిల్లీలోకి డీజిల్ బస్సులను నిషేధించారు. ప్రభుత్వంగాలి నాణ్యత అధ్వాన్నంగా ఉండటంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ,గౌతమ్ బుద్ నగర్‌లలో బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ నాలుగు-చక్రాల వాహనాలపై ఆంక్షలు విధించారు. కాలుష్య కట్టడి కోసం నోయిడా పోలీసుల చర్యలు 10 ఏళ్ల డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను నిషేధించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పొల్యూషన్ చెక్ లేని వాహనాలపై చర్యలు తీసుకోనున్నారు. 10-15 సంవత్సరాలనాటి 175 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 7000 వాహనాలకు జరిమానా విధించారు.

Also Read : ED Raids : ఎన్నికల వేళ మనీలాండరింగ్ కేసులో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు

ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యంతో నేడు,రేపు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ప్రైమరీ,ప్రీ ప్రైమరీ తరగతులను రద్దు చేశారు. విద్యాశాఖ ప్రైమరీ , ప్రీ ప్రైమరీ తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

Also Read : Sara Tendulkar : ప్రపంచ కప్ లో శుభ్‌మాన్ గిల్ సెంచరీ మిస్.. సారా టెండూల్కర్ స్పందన వైరల్‌

అధ్వాన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విధించాల్సిన తదుపరి చర్యలపై చర్చించడానికి అధికారులు అత్యవసర సమావేశానికి కూడా పిలుపునిచ్చారు.అధ్వాన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులు, స్టోన్ క్రషింగ్, మైనింగ్‌లను తక్షణమే నిషేధించాలని కేంద్రం కాలుష్య నియంత్రణ ప్యానెల్ ఆదేశించింది.కేంద్రం ఇప్పటికే వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక అయిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3ని యాక్టివేట్ చేసింది.