ED Raids : ఎన్నికల వేళ మనీలాండరింగ్ కేసులో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్‌డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపారు....

ED Raids : ఎన్నికల వేళ మనీలాండరింగ్ కేసులో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు

ED Raids

Updated On : November 3, 2023 / 10:46 AM IST

ED Raids : అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్‌డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపించింది. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ కు చెందిన సుబోద్ అగర్వాల్ సహా జైపూర్ నగరంలోని 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది.

Also Read : US Flying Surveillance Drones : గాజాలో బందీల ఆచూకీ కోసం అమెరికా నిఘా డ్రోన్లు

ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరి ఇళ్లపై కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ స్కాంలో ఈడీ అధికారులు సెప్టెంబరులోనూ దాడులు చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లలో పర్సంటేజీలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. ఇప్పటికే రాజస్థాన్ అవినీతి నిరోధకశాఖ అధికారులు శ్రీ శ్యాం ట్యూబ్ వెల్ కంపెనీ అధినేత పదం చంద్ జైన్, శ్రీగణపతి ట్యూబ్ వెల్ కంపెనీ యజమాని మహేష్ మిట్టల్ ఇతర అధికారులపై కేసు నమోదు చేశారు.

Also Read : Selling Snake : మధురలో పాములు, పాము విషం విక్రయం కేసులో ముగ్గురి అరెస్ట్

పనులు చేయకుండానే తప్పుడు నివేదికలతో డబ్బు స్వాహా చేశారని దర్యాప్తులో వెల్లడైంది. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తుండగా ఈ పథకంలో అక్రమాలు జరిగాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 25వతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న ఈడీ దాడులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వం ఆదేశంతో రాజస్థాన్ లక్ష్యంగా ఎన్నికల వేళ ఈడీ దాడులు చేస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

Also Read : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…