Covid Cases: ఢిల్లీలో ఒక్క రోజులో 1,369 కరోనా కేసులు
Covid Cases: భారత్ లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 దేశంలో వ్యాప్తి చెందుతోంది.

Corona Virus
Covid Cases: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో కొత్తగా 1,369 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. పాజిటివిటీ రేటు 31.9 శాతానికి పెరిగిందని తెలిపింది. అలాగే, కరోనా వల్ల అయిదుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
దీంతో కరోనా వల్ల ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26,560కు చేరినట్లు చెప్పింది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,631గా ఉందని వివరించింది. ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,21,593కు పెరిగింది. 24 గంటల్లో 1,071 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. కొత్తగా 3,906 కరోనా పరీక్షలు చేశారు.
మరోవైపు, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 660 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 6,047కు చేరిందని వివరించింది. భారత్ లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 దేశంలో వ్యాప్తి చెందుతోంది. దాని వల్ల ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉండడం కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది.
covid-19 Cases : దేశంలో 50వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య .. ఒకేరోజు 27 మంది మృతి