దేవ్‌బంద్‌ ఉగ్రవాదుల పుట్టిల్లు..మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులంతా అక్కడివారే: కేంద్రమంత్రి

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 09:48 AM IST
దేవ్‌బంద్‌ ఉగ్రవాదుల పుట్టిల్లు..మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులంతా అక్కడివారే: కేంద్రమంత్రి

Updated On : February 13, 2020 / 9:48 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ లాంటి బడా టెర్రరిస్టులు..ప్రపంచంలోనే మోస్ట్ వాటెంట్ ఉగ్రవాదులంతా దేవ్‌బంద్‌ నుంచే పుట్టుకొచ్చారని బీజేపీ నేత..కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. 

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలన్నీ దేశానికి వ్యతిరేకమే. దానికి సంబంధించి ఆందోళన చేసేవారంతా దేశ ద్రోహులేని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని  షరాన్‌పూర్‌లో బుధవారం ఉగ్రవాదులకు గంగోత్రిలాంటిదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా నేను ఇదే మాట చెప్పాననీ గిరిరాజ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసారు.  దేవ్‌బంద్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో..షరాన్ పూర్ లో సీఏఏ అనుకూల ప్రదర్శనలో గిరిరాజ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవ్‌బంద్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసనల గురించి గిరిరాజ్ సింగ్‌ను  మీడియా ప్రశ్నించగా.. మీడియా ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం మరో ఖలీఫా ఉద్యమం వంటిదన్నారు. 

కేంద్రమంత్రి వ్యాఖ్యలను షరాన్‌పూర్‌ ఎంపీ హాజీ ఫజ్లూర్‌ రెహాన్‌ తీవ్రంగా ఖండించారు. దేవ్‌బంద్‌ను స్వాతంత్య్ర సమరయోధుల కర్మభూమి..దాన్ని ఉగ్రవాదుల పుట్టినిల్లు అని వ్యాఖ్యానించటం స్వాతంత్ర్య సమరయోధులను అవమానించినట్లేనని అన్నారు.  దేవబంద్‌కు చెందినవారు ఉలేమాలు స్వాతంత్య్రం కోసం పోరాడారని, జైలుకు వెళ్లారని ఈ సందర్భంగా హాజీ ఫజ్లూర్‌ రెహాన్‌ గుర్తుచేశారు. గిరిరాజ్‌ సింగ్ కళ్లు ముస్లిం పట్ల ద్వేషంతో మూసుకుపోయాయని..ఉగ్రవాదులకు ముడిపెడుతూ పవిత్రమైన గంగోత్రిని అవమానిస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ మసూద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.