ఉల్లిపాయలు అమ్మేవ్యక్తి వేషంలో 1300కిలోమీటర్ల ప్రయాణించి ఇంటికి..

ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవడానికి ప్రేమ్ మూర్తి పాండే కొత్తగా ఆలోచించాడు. ముంబై ఎయిర్‌పోర్టులో పనిచేసే మూర్తి.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు.
‘నేను ఉంటున్న అంధేరీలోని ఆజాద్ నగర్ లో చాలా ఇరుకైన ప్రాంతం. అక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. బస్సులు, విమానాలు, రైళ్లు తిరగడం మానేశాయి. ఇన్ని చేసినా ప్రభుత్వం ఒక మార్గం ఓపెన్ చేసినట్లు అనిపించింది’ అత్యవసరాలు, పళ్లు, కూరగాయలు తెరిచే ఉంచింది.
అందుకని 1300కేజీల పుచ్చకాయలు కొన్నాను. ఏప్రిల్ 17న మినీ ట్రక్ అద్దెకు తీసుకుని నాశిక్ దగ్గరి ప్రాంతంలోని పింపాగాన్ అంటే 200కిలోమీటర్ల దూరం ప్రయాణించి పుచ్చకాయలను రూ.10వేలకు కొన్నా. వాటిని కూడా అమ్మి తిరిగి ట్రక్కును ముంబైకి పంపించేశా. అక్కడ పింపాగావ్ మార్కెట్ స్టడీ చేశా. ఉల్లిపాయల ధర గిరాకీగా అనిపించింది.
అందుకే 25వేల 520కేజీల ఉల్లిని కేజీ రూ.9.10చొప్పున రూ.2.32లక్షలకు కొనుగోలు చేశాం. అక్కడే ఓ ట్రక్ రూ.77వేల 500కు ఏప్రిల్ 20న అద్దెకు తీసుకున్నా. అలహాబాద్ కు 1200కిలోమీటర్లు ప్రయాణించా. ఏప్రిల్ 23న ముండేరా హోల్ సేల్ మార్కెట్ కు చేరుకున్నాడు. దురదృష్టవశాత్తు అంత లోడ్ కు డబ్బులిచ్చి కొనుక్కునేంత వ్యక్తులు కనిపించలేదు.
చేసేది లేక కొత్వా ముబార్క్‌పూర్ ఊరికే ఉల్లిపాయలు తీసుకెళ్లి అన్ లోడ్ చేయించి ట్రక్ వెనక్కి పంపించేశాడు. అక్కడికి చేరాక టీపీ నగర్ పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలంటూ సూచించారు. పాండే ఉల్లిపాయలకు మంచి ధర పలుకుతుందనే ఆశతోనే ఉన్నాడు.