Destination Delhi: నేతలంతా హస్తినకు.. వీరంతా మంత్రులయ్యే ఛాన్స్..

రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రెండోసారి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసింది కేంద్రం.

Destination Delhi: నేతలంతా హస్తినకు.. వీరంతా మంత్రులయ్యే ఛాన్స్..

Full List Of Cabinet Probables

Updated On : July 7, 2021 / 9:27 AM IST

Full List Of Cabinet Probables: రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రెండోసారి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసింది కేంద్రం. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉండగా.. ఇవాళ(7 జులై 2021) సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు రాష్ట్రపతి భవన్‌‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మొత్తం 21 మంది కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఈమేరకు ఆయా వ్యక్తులకు ఢిల్లీకి రావాలని సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. యువ నేతలకు ప్రధాని మోదీ పెద్ద పీటవేసినట్లుగా కూడా హస్తిన వర్గాల నుంచి సమాచారం.

యువ‌కులు, బీసీలు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకించి విద్యావంతుల‌కు కేబినెట్‌లో చోటు దక్కనుందని చెబుతున్నారు. వీరంతా ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు.

కేంద్ర మంత్రులయ్యే అవకాశం ఉన్నవారి లిస్ట్:
జ్యోతిరాదిత్య సింధియా
సర్బానంద సోనోవాల్
నారాయణ్ రాణే
పశుపతి పరాస్
అనుప్రియా పటేల్
పంకజ్ చౌదరి
రీటా బహుగుణ జోషి
రామ్‌శంకర్ కాథెరియా
వరుణ్ గాంధీ
ఆర్‌సీపీ సింగ్
లల్లన్ సింగ్
రాహుల్ కస్వాన్
సిపి జోషి
సకాల్‌దీప్ రాజ్‌భర్
రంజన్ సింగ్ రాజ్‌కుమార్

కేంద్రంలో మొత్తం 81మంది కేంద్ర మంత్రులు ఉండగా.. ప్రస్తుతం 53 మంది మంత్రులే ఉన్నారు. లేటెస్ట్ కేబినెట్ విస్తరణలో 22మందికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రుల్లో ఒక‌టి కంటే ఎక్కువ శాఖ‌ల‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న వారిపై ప‌నిభారం త‌గ్గించాల‌ని ప్ర‌ధాని మోదీ భావిస్తున్నారు. అసలు ప‌నితీరు స‌రిగ్గాలేని వారిని పక్కనబెట్టనున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ నుంచి స్మృతి ఇరానీ, సదానంద గౌడను తప్పించనున్నట్లు ప్రచారం సాగుతుంది. మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తప్పించి, ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనుండగా.. ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. ఏపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కకపోవచ్చునని అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావుకు ఏపీ నుంచి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకే నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.