Dev Raturi: 46 ఏళ్ల ఈ భారతీయుడు.. చైనాలో హీరో.. ఆ దేశంలో పాఠ్యపుస్తకాల్లో ఆయన కథ

వెయిటర్‌గా పనిచేశాడు.. 8 రెస్టారెంట్టు ప్రారంభించాడు. బాలీవుడ్‌లో సెలెక్ట్ కాలేదు.. చైనాలో పాప్యులర్ స్టార్ అయ్యాడు.

Dev Raturi: 46 ఏళ్ల ఈ భారతీయుడు.. చైనాలో హీరో.. ఆ దేశంలో పాఠ్యపుస్తకాల్లో ఆయన కథ

Dev Raturi

Dev Raturi – China: దేవ్ రాటూరి.. ఆయన వయసు 46 ఏళ్లు. ఉత్తరాఖండ్‌(Uttarakhand )లోని తెహ్రీ గఢ్వాల్‌ జిల్లాలో జన్మించారు. ఆయన తన సొంత గ్రామం కెమ్రియా సౌర్‌ నుంచి చైనా వెళ్లి అక్కడ పెద్ద నటుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన స్ఫూర్తిదాయకమైన జీవిత కథను పాఠ్యపుస్తకాల్లో చేర్చించి చైనా ప్రభుత్వం. దేవ్ రాటూరీ చైనాలో 35 సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించాడు.

బాలీవుడ్‌లో సెలెక్ట్ కాలేదు..
బ్రూస్ లీకి దేవ్ రాటూరి డైహార్డ్ ఫ్యాన్. బ్రూస్ లీ అడుగుజాడల్లోనే నడవాలనుకున్నాడు. 1998లో ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు వెళ్లాడు. డైరెక్టర్, నటుడు పునీత్ ఇన్సార్ సమక్షంలో ఆ ఆడిషన్స్ జరిగాయి. దేవ్ రాటూరి ఎంపిక కాలేదు. ఆ సమయంలో చాలా నిరాశకు గురయ్యాడు.

ఆ సమయంలో అతడికి తెలియదు.. చైనాలో ఓ స్టార్ అవుతానని. కరాటేపై ఆయనకు బాగా ఆసక్తి ఉంది. ఆ క్రమంలో ఆయన 2005లో చైనాకు వెళ్లాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నాడు. ఉపాధి కోసం షెన్‌ఝెన్‌ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాడు. రెండేళ్లలో చైనీస్ భాష నేర్చుకున్నాడు.

బీజింగ్ లోని ఓ రెస్టారెంట్ మేనేజర్ అయ్యాడు. అనంతరం కొందరితో కలిసి ఓ రెస్టారెంట్ ఫ్రాంచైజీ బ్రాంచ్ ప్రారంభించాడు. 2011లో భారత్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ చైనాకు వెళ్లాడు. 2013లో షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్ సిటీలో రెడ్ పోర్ట్ పేరుతో సొంత రెస్టారెంటును ప్రారంభించాడు. 2015లో మరో రెస్టారెంటును ఓపెన్ చేశాడు. ఇప్పుడు అతడికి మొత్తం ఎనిమిది రెస్టారెంట్లు ఉన్నాయి.

2016లో కోరిక నేరవేరిన వేళ..
రెస్టారెంట్లు స్థాపించినా నటుడు కావాలన్న కల దేవ్ రాటూరిలో ఇంకా ఉంది. చివరికి అతడి కోరిక 2016లో నెరవేరింది. చైనా సినిమాలో ఓ ఇండియన్ పాత్రలో నటించాడు. అది నెగటివ్ రోల్.. అయినప్పటికీ ఇక ఆ సినిమా తర్వాత వెనక్కుతిరిగిచూసుకోలేదు రాటూరీ.

సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. ఆయనను స్టార్ ని చేశాయి. ఇలా రెస్టారెంట్లో వెయిటర్‌ నుంచి సినిమా తార వరకు, ఎనిమిది రెస్టారెంట్ల యజమాని వరకు… ఆయన ఎదిగిన తీరును తెలుపుతూ ఇప్పుడు విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఆయన కథను చేర్చింది చైనా ప్రభుత్వం.

No Confidence Motion: అటల్ బిహారీ వాజ్‭పేయి ఓడారు, నరేంద్ర మోదీ నెగ్గారు