No Confidence Motion: అటల్ బిహారీ వాజ్‭పేయి ఓడారు, నరేంద్ర మోదీ నెగ్గారు

బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్‭పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు

No Confidence Motion: అటల్ బిహారీ వాజ్‭పేయి ఓడారు, నరేంద్ర మోదీ నెగ్గారు

Modi and Vajpayee: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తాజాగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా, ఈ తీర్మానం ఎదుర్కోవడం ఆయనకు ఇది రెండవసారి. 2019లో మొదటిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. మళ్లీ ఐదేళ్లకు ఆ పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే ఈ రెండు సందర్భాలు సార్వత్రిక ఎన్నికలకు ముందే రావడం గమనార్హం. నాలుగుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి ఇది మూడవ సారి ఎదుర్కొంటున్న పరీక్ష. అయితే గతంలో ఈ పరీక్షను ఒకసారే ఎదుర్కొని తన బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‭పేయి.

No Confidence Motion: 2023లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని 2019లోనే చెప్పిన ప్రధాని మోదీ

బీజేపీ నుంచి వాజ్‭పేయి, నరేంద్రమోదీ మాత్రమే ప్రధానులు అయ్యారు. బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్‭పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు. అయితే 2014లో మరోమారు అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే సంఖ్యా బలంలో మోదీ ప్రభుత్వం పటిష్టంగా ఉండడంతో 2019లో విపక్షాలు పెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయింది. తాజా తీర్మానం పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.

No Confidence Motion: ఓడిపోతామని తెలిసీ కూడా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఇండియా ప్లాన్ ఏంటంటే?

వాజ్‭పేయికి ముందు రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్‭పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయింది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‭పేయి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అంతే కాకుండా.. కేవలం 16 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది కూడా. 1996 మే 16న ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‭పేయి ప్రమాణ స్వీకారం చేశారు. అదే 1999 జూన్ 1న రాజీనామా చేశారు. వాజ్‭పేయికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 ఓట్లు వచ్చాయి.

No Confidence Motion: అవిశ్వాస తీర్మానం చరిత్ర తెలుసా? ఇంతకీ ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి?

ఇక తాజా విషయానికి వస్తే.. నరేంద్రమోదీ ప్రభుత్వం మీద రెండవసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది విపక్ష కాంగ్రెస్ పార్టీ. 2019లో కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఇక తాజాగా పెట్టిన తీర్మానం పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. తాజా తీర్మానానికి స్పీకర్ ఇంకా తేదీ నిర్ణయించలేదు.