80గంటల సీఎం.. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ మీద మరో ట్విస్ట్. అజిత్ పవార్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా ప్రకటించారు. రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 80 గంటల్లోనే తాను రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
> శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. >అంతర్గత కలహాలతో ప్రభుత్వం కూలిపోతుంది.
> గత ఐదేళ్లలో అద్భుతమైన పాలన అందించాం.
> సమర్థవంతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం.
> ప్రజలు మాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం.
> ప్రభుత్వ ఏర్పాటులో మాకు ఎలాంటి దురుద్దేశం లేదు.
> పార్టీలను చీల్చాలనే ఉద్దేశం అస్సలు లేదు.
> ప్రజాతీర్పుకు అనుకూలంగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాం.
> అసెంబ్లీలో బీజేపీనే అతి పెద్ద పార్టీ. మెజార్టీ ప్రజలు బీజేపీకే అనుకూలంగా తీర్పునిచ్చారు.
> ఎన్నికల ప్రచారంలోనూ శివసేన ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలేదు.
> ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ మాకే ఆహ్వానం పంపారు
> శివసేన మద్దతు కోసం ఎదురుచూశాం.
> శివసేన సిద్ధాంతాలని గాలికి వదిలేసింది.
> ఫలితాల తర్వాత శివసేన వైఖరి మారిపోయింది
> మాకు సంఖ్యాబలం లేదని శివసేన గవర్నర్ కు తెలిపింది.
> ముఖ్యమంత్రి పదవి పంచుతామని శివసేనకు మేం హామీ ఇవ్లేదు.
> ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ పవారే మమ్మల్ని సంప్రదించారు.