డిజిలాకర్‌తో ఎక్కడనుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు..ఒరిజినల్ డాక్యుమెంట్లు అక్కర్లేదు

DigiLocker ఇకపై పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లను పాస్‌పోర్ట్ ఆఫీస్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సదరు వ్యక్తి తన డిజిలాకర్‌లో భద్రపరిచిన పత్రాల కాపీలను పేపర్‌లెస్ విధానం ద్వారా పాస్‌పోర్ట్ కోసం సమర్పించవచ్చు. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్” పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్” కోసం “డిజిలాకర్” వేదికను ప్రారంభించారు.
దీని సాయంతో ప్రజలు ఎక్కడ నుంచైనా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలను భద్రపరిచేందుకు కేంద్రం డిజిలాకర్‌ను అనుమతించింది. ఈ డిజిలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను దృవీకరణ కోసం ఉపయోగించవచ్చు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేది డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లు లేదా ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి, ధృవీకరించడానికి సరైన వేదిక కానుంది.
భౌతికంగా పత్రాల వాడకాన్ని ఈ విధానం తొలగిస్తుంది. అంతేకాకుండా, పాస్‌పోర్ట్‌లు కూడా డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేస్తే వినియోగదారులకు అధికారికంగా అవసరమైన వివరాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పాస్‌పోర్టును పోగొట్టుకున్నా డిజిలాకర్‌లో భద్రపరిచిన డిజిటల్ పాస్‌పోర్ట్ చాలా ఉపకరిస్తుంది. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ దేశంలో పాస్‌పోర్ట్ సేవలను అందించే దిశగా భారీ పరివర్తన తెచ్చినట్లు అయన తెలిపారు
మరోవైపు, త్వరలో ఈ -పాస్‌పోర్ట్ విధానాన్ని రూపొందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నది. ఇది భద్రతను పెంచడంతోపాటు విదేశీ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో పౌరులకు సౌకర్యవంతంగా ఉంటుంది.