Digvijaya Singh: రూ.1కే 10వేల అడుగుల స్థలాన్ని ఆర్ఎస్ఎస్‌కు కట్టబెట్టిందంటూ మాజీ మంత్రి ఆందోళన
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆందోళనకు దిగారు.

Digvijay Singh (1)
Digvijaya Singh: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆందోళనకు దిగారు. భోపాల్ లోని 10వేల అడుగుల స్థలాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు రూ.1కే కేటాయించిందని తన అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనను అడ్డుకున్న పోలీసులకు ఎదురుతిరిగారు.
మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆయన అనుచరులు ఆర్ఎస్ఎస్ కు స్థలం కేటాయించడంపై ఎదురుతిరిగారు. వారిని వాటర్ కెన్నాన్ లో చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నాం. ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే చేసిన నిరసన ఇది. ఈ చర్యలకు కాంగ్రెస్ నాయకులు భయపడరు’ అంటూ పోస్టు ద్వారా విషయాన్ని వెల్లడించారు.
దిగ్విజయ్ సింగ్.. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సంస్థకు కేవలం ఒక్క రూపాయికే స్థలం కేటాయించారంటూ ఆరోపించారు.
కోట్ల విలువ ఉన్న గోవిందపురా ఇండస్ట్రియల్ ఏరియా.. నేను, శివరాజ్ కలిసి అక్కడ మొక్కలు కూడా నాటాం. వర్కర్లంతా ఇక్కడకు లంచ్ తెచ్చుకుంటారు. ఇక్కడ ఉన్న చెట్లు నరికేసి నిప్పుబెట్టారు. చూడటానికి నేనే వచ్చా. అపాయింట్మెంట్ కోసం శివరాజ్ మామూని కూడా సంప్రదించలేదు.
దానికి సమాధానం చెప్తాడని కూడా అనుకోలేదు. బీహెచ్ఈఎల్ సహకార సంస్థలు పనిచేసుకోవడానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అప్రూవ్ చేశారంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్.