ప్రముఖ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకు మధ్య గొడవ.. రంగంలోకి పోలీసులు
ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

dispute between actor yash parents and villagers: ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్‌లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. అయితే తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్తులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్ మంగళవారం(మార్చి 9,2021) తిమ్మాపురకు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయతీ చేశారు. యశ్ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
చిన్న గొడవగా మొదలైన ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో యశ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యశ్‌పై కూడా గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో మాట్లాడి వచ్చిన తర్వాత అతడి కారును చుట్టుముట్టారు. తన కారును చుట్టుముట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యశ్.. వారి తీరును తప్పుబట్టాడు. మీరు ఇలాగే చేస్తే.. పరిస్థితిని పోలీసులు వారి తరహాలో కంట్రోల్ చేయాల్సి ఉంటుందని గ్రామస్థులతో అన్నాడు.
గొడవ చేస్తున్న వారి తీరును హీరో యశ్ తప్పుబట్టాడు. తాను హసన్ జిల్లాలోనే పుట్టానని.. ఇక్కడ భూమి కొనుక్కున్న ఏమైనా చేయాలన్నది తన కల అని చెప్పాడు. ఇక్కడ తాము కొంత పని చేస్తున్నామని.. అయితే కొందరు వచ్చి… పని చేస్తున్న వారిపై దౌర్జన్యం చేశారని యశ్ ఆరోపించాడు. వారితో తమ కుటుంబసభ్యులు మాట్లాడే ప్రయత్నం చేశారని వివరణ ఇచ్చాడు.