Diwali 2024 : దీపావళికి మీ ఊరు వెళ్తున్నారా? లక్నో నుంచి బీహార్ వరకు ప్రత్యేక రైలు ప్రారంభం..!

Diwali 2024 : భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్‌లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి రాత్రి 9:30 గంటలకు ఛప్రా చేరుకుంటుంది.

Diwali 2024 : దీపావళికి మీ ఊరు వెళ్తున్నారా? లక్నో నుంచి బీహార్ వరకు ప్రత్యేక రైలు ప్రారంభం..!

Diwali 2024 _ Indian Railways Launches Special Train From Lucknow To Bihar

Updated On : October 26, 2024 / 4:12 PM IST

Diwali 2024 : వచ్చే వారమే దీపావళి.. ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బీహార్‌కు వెళ్లే రైళ్లు నిండిపోయాయి. చాలా మంది 4 నెలల ముందుగానే తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. కానీ, కొందరికి టిక్కెట్లు దొరకడం లేదు. ఇప్పుడు అన్ని రైళ్లలో ఖాళీ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని ఛప్రా జంక్షన్‌కు వందే భారత్ రైలు ప్రారంభమైంది.

ఈ వందే భారత్ రైలులో దీపావళి, ఛత్ వేడుకల కోసం సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవచ్చు. ఈ రైలులో కన్ఫార్డ్ టిక్కెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఉత్తర బీహార్‌లోని ఛప్రా ప్రధాన జంక్షన్. ఇక్కడ నుంచి మీరు సివాన్, గోపాల్‌గంజ్, వైశాలి, ముజఫర్‌పూర్ వంటి ఇతర జిల్లాలకు కొన్ని గంటల్లో చేరుకోవచ్చు.

భారతీయ రైల్వే లక్నో నుంచి బీహార్‌లోని ఛప్రా వరకు వందే భారత్ ప్రత్యేక రైలును ప్రారంభించింది. రైలు నంబర్ 02270. లక్నో ఎన్ఆర్ నుంచి మధ్యాహ్నం 2:15 కి బయలుదేరి రాత్రి 9:30 గంటలకు ఛప్రా చేరుకుంటుంది. సుల్తాన్‌పూర్, వారణాసి, ఘాజీపూర్, బల్లియా, సురేమాన్‌పూర్ చివరకు ఛప్రా వద్ద ఆగుతుంది.

ఈ రైలు బీహార్‌లోని ప్రయాణికులకు మాత్రమే కాకుండా తూర్పు యూపీలోని బల్లియా, ఘాజీపూర్‌లోని ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దీపావళి ఛత్ పూజను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రైలు వారానికి 6 రోజులు నడుస్తుంది. మంగళవారాల్లో ఈ రైలు సర్వీసు ఉండదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం.. అక్టోబర్ 27 నుంచి ఛత్ పీరియడ్ వరకు చాలా టిక్కెట్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

వందే భారత్ రైలు చైర్ కార్ ఎగ్జిక్యూటివ్ కార్ అనే రెండు కోచ్‌లను కలిగి ఉంది. లక్నో నుంచి ఛప్రా వరకు చైర్ కార్‌కు రూ. 1780, ఎగ్జిక్యూటివ్ కారుకు రూ. 3125 టిక్కెట్ చెల్లించాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఛప్రా నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఉదయం 6:30 గంటలకు లక్నో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు టికెట్ ధర రూ.1285 ఉంటే.. బేస్ ఫేర్ రూ. 1105 ఉంటుంది. అయితే, లక్నో నుంచి ఛప్రా వెళ్లేటప్పుడు క్యాటరింగ్ ఛార్జీ రూ.530 ఉంటుంది. ఛప్రా నుంచి లక్నోకు తిరుగు ప్రయాణంలో రాత్రి పూట ఆహారం అందిస్తారు. క్యాటరింగ్ ఛార్జీ కేవలం రూ. 35 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు కూడా ఈ రైలు బెస్ట్ ఆప్షన్. ఢిల్లీ నుంచి బీహార్‌కు నేరుగా రైళ్లు పూర్తిగా బుక్ చేసుకుంటే.. ప్రయాణికులు మరో రైలు లేదా యూపీ ప్రభుత్వ బస్సులో లక్నో చేరుకుని, అక్కడి నుంచి వందే భారత్ స్పెషల్‌ని ఎక్కవచ్చు. తద్వారా ఛత్ పూజ కోసం తొందరగా బీహార్‌కు ప్రయాణికులు చేరుకోవచ్చు.

Read Also : రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై నెట్టేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది: వైఎస్ షర్మిల