Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఓ వైద్యుడుసహా ఆరుగురు కార్మికులు మృతి.. అమిత్ షా సీరియస్
ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

indian army
Gagangir Terror Attack: ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు కార్మికులు గాయపడగా వారు శ్రీనగర్ లోని షేర్-ఎ-కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) లో చికిత్స పొందుతున్నారు. రాత్రి 8.30 గంటలకు భోజన సమయంలో కార్మికులంతా మెస్ లో గుమ్మిగూడారు. ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకొని కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రెండు వాహనాలు కూడా దగ్దమయ్యాయి.
జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీ కార్మికులకోసం తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేశారు. కార్మికులు పని ముగించుకొని ఆవాసాలకు చేరుకున్నారు. భోజనాలు చేసేందుకు గుమ్మిగూడిన సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ సొరంగం సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ లోయను సోనామార్గ్ తో కలుపుతుంది. ఈ సొరంగం పనులను ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆప్కో అనే నిర్మాణ సంస్థ చేస్తోంది. వాస్తవానికి 2025 నాటికి సొరంగం పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారు.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారిలో గుర్మీత్ సింగ్, డాక్టర్ షానవాజ్, అనిల్ కుమార్ శుక్లా, ఫహీమ్ నజీర్, శశి అబ్రోల్, మహ్మద్ హనీఫ్, కలీమ్ ఉన్నారు. గాయపడిన వారిలో ఇందర్ యాదవ్, మోహన్ లాల్, ముస్తాక్ అహ్మద్, ఇష్పాక్ అహ్మద్ భట్, జగ్తార్ సింగ్ ఉన్నారు. అయితే, ఈ దాడిని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) నిర్వహించింది. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు, సైనిక దళాలు ఘటన స్థలంకు చేరుకొని ఉగ్రవాదులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దాడిని హేయమైన చర్యగా ఖండించిన ఆయన.. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను విడిచిపెట్టబోమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అమిత్ షా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిని వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా.. ఉగ్రవాదుల దాడిని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. స్థానికేతరులైన కార్మికులపై జరిగిన ఈ దాడి పిరికిచర్య అని అన్నారు.
#WATCH | J&K | Security forces took position & cordoned off the area in Gaganger, Sonamarg, Ganderbal, following a terror attack yesterday. Authorities launched a search operation to neutralize the attackers and ensure the safety of the region.
(Visuals deferred by unspecified… pic.twitter.com/kEgFah4ee8
— ANI (@ANI) October 21, 2024