ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు,నర్సులతోసహా 108మంది క్వారంటైన్‌కి…

ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి దగ్గరిగా ఉన్న డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ సిబ్బంది ఇలా మొత్తం 108మందిని క్వారంటైన్ లో ఉంచారు.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400కి చేరువలో ఉంది. అయితే ఇందులో సగానికి పైగా పాజిటివ్ కేసులు నిజాముద్దీన్ ప్రాంతంలో గత నెలలో నిర్వహించబడిన తగ్లిబీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారివే. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది. 86మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో అయితే దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో దాదాపు 300కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read | భారత్‌లో రోజువారీ కూలీలకు రూ.7.5 కోట్లు విరాళమిచ్చిన నెట్ ఫ్లిక్స్