అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 10:38 AM IST
అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష్,మాయావతి,మరో ఏదుగురు పోటీ చేసే నియోజకవర్గాల్లో తాము పోటీచేయడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

అయితే యూపీలో ఘట్ బంధన్ కు బలవంతంగా ఏడు స్థానాలు వదిలిపెడుతూ కాంగ్రెస్…ప్రజల్లో అయోమయం సృష్టించకూడదని సోమవారం(మార్చి-18,2019) మాయావతి ట్వీట్ చేశారు.యూపీలో గానీ,ఇతర రాష్ట్రాల్లో గానీ తమ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదని ఆమె సృష్టం చేశారు.

కాంగ్రెస్ యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని అన్నారు.రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమికి పూర్తి శక్తిసామర్థ్యాలున్నాయని ఆమె తెలిపింది. రోజూ అబద్దాలు చెప్పడం,అయోమయం సృష్టించే కాంగ్రెస్ ట్రాప్ లో కార్యకర్తలెవరూ పడవద్దని ఆమె విజ్ణప్తి చేశారు. కాంగ్రెస్ ఎటువంటి అయోమయాన్ని సృఫ్టించకూడదంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలిపారు.