ఢిల్లీ, కశ్మీర్ లలో భూ ప్రకంపనలు

జమ్మూ కశ్మీర్ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి 10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. ఈ ప్రభావంతో దేశరాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ..ఆస్తి నష్టాలు వాటిల్లలేదు. శ్రీనగర్‌కు వాయువ్యంగా 118 కి.మీ. దూరంలో 40 కి.మీ. అడుగులో భూకంపనలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనల కారణంగా శ్రీనగర్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్, జమ్మూ కశ్మీర్లోని బండీపురలోనూ భూమి కంపించిందని అధికారులు తెలిపారు.