కమల్ హాసన్​ వాహనంలో ప్లయింగ్​ స్క్వాడ్​ సోదాలు

ముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్(MNM)​ అధినేత కమల్​ హాసన్ ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనీఖీ చేశారు.

కమల్ హాసన్​ వాహనంలో ప్లయింగ్​ స్క్వాడ్​ సోదాలు

Election Flying Squad

Updated On : March 23, 2021 / 6:58 AM IST

Election flying squad ప్రముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్(MNM)​ అధినేత కమల్​ హాసన్ ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనీఖీ చేశారు. సోమవారం తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. తంజావూరు జిల్లాలో ఆయన వాహనాన్ని ఆపి ప్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేసింది.

తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్న కమల్ హాసన్.. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో కమల్ హాసన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయపు నడకతో మొదలుకుని వేర్వేరు కార్యక్రమాల ద్వారా రోజంతా ఓటర్లను కలుసుకుంటున్నారు. చిరు వ్యాపారులతో ముచ్చటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ స్థానానికి అన్నాడీఎంకే సభ్యుడు అమ్మన్ అర్జునన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే కోయంబత్తూర్​ సౌత్​ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కాషాయ పార్టీకి కేటాయించింది. బీజేపీ.. ఈ స్థానం నుంచి వనతి శ్రీనివాసన్​ను రంగంలోకి దించింది. ఆమె రెండో సారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2016లో భాజపా తరపునే పోటీ చేసిన వనతి.. 33,113 ఓట్లు దక్కించుకొని మూడో స్థానానికి పరిమితమయ్యారు. కూటమిలో భాగంగా సీటు సంపాదించిన వనతి.. ఈ సారైనా ఇక్కడి నుంచి గెలుపొందాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, డీఎంకే-కాంగ్రెస్ కూటమి తరపున కోయంబత్తూర్ సౌత్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర జయకుమార్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయనకూ ఇది రెండో ప్రయత్నం. అన్నాడీఎంకేపై వ్యతిరేకత తనకు కలిసివస్తుందని జయకుమార్ భావిస్తున్నారు.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎంఎన్‌ఎం 154 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 80 సీట్లలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న ‘ఆల్‌ ఇండియా సమతువ మక్కల్ కచ్చి’, ‘ఇంధియ జననయగ కచ్చి’ చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.