ప్రభుత్వ కీలక నిర్ణయం : మెటర్నిటీ చట్టం కిందకు ప్రైవేట్ ఉద్యోగులు

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 07:04 AM IST
ప్రభుత్వ కీలక నిర్ణయం : మెటర్నిటీ చట్టం కిందకు ప్రైవేట్ ఉద్యోగులు

Updated On : October 17, 2019 / 7:04 AM IST

ప్రైవేటు స్కూల్స్,కాలేజీల ఉద్యోగులను,అన్ ఎయిడెడ్ సెక్టార్ లో పనిచేస్తున్నవారిని మెటర్నిటీ బెన్ ఫిట్ యాక్ట్ కిందకు తీసుకొస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ యాక్ట్ కింద ప్రైవేటు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉద్యోగులను తీసుకొచ్చిన మొదటిరాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ ప్రభుత్వం ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లో చేర్చడానికి అనేక చర్యలు తీసుకుంది. అందులో ఇది ఒకటి.

ప్రసూతి ప్రయోజన చట్టం(మెటర్నిటీ బెన్ ఫిట్ యాక్ట్)కింద పిల్లల పుట్టుకకు ముంద, తరువాత ఒక నిర్దిష్ట కాలానికి గర్భిణీలకు ప్రసూతి సెలవులతోపాటుగా కొన్ని ఇతర ప్రయోజనాలను అందుతాయి. ఇది ప్రసూతి సమయంలో మహిళలకు రక్షణ కల్పిస్తుంది. పనికి హాజరుకాకపోయినా కూడా పిల్లల సంరక్షణలో జీతం కోల్పోకుండా ఉండటం వంటి బెన్ ఫిట్స్ ఉన్నాయి.

1961 నాటి అసలు చట్టం మహిళలకు 12 వారాల సెలవు చెల్లించే అధికారం ఇవ్వగా, 2017 లో చేసిన సవరణ దానిని 26 వారాలకు పొడిగించింది. ఆగస్టు 29 న కేరళ ప్రభుత్వ కేబినెట్.. ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులను చట్టం పరిధిలోకి తీసుకురావడానికి నోటిఫికేషన్ జారీ చేయడానికి కేంద్రం అనుమతి కోరింది.కేంద్రం దీనికి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఇది రాష్ట్రంలో అమలుకానుందని కేరళ కార్మికశాఖ మంత్రి టీపీ రామక్రిష్ణన్ తెలిపారు.