జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.

జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. పంపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
దీంతో టెర్రరిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి.
మరో ఉగ్రవాది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం షోపియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది.