ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 11:56 AM IST
ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

Updated On : May 8, 2019 / 11:56 AM IST

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. 

ఇటీవలే మావోయిస్టులు జరిపిన దాడిలో 16 మంది పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టులను ఏరివేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు పోలీసులు. మే 08వ తేదీ బుధవారం ఒడిశా, గడ్చిరౌలీ, ఛత్తీస్ గడ్, కోరాపుట్ తదితర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఒక్కదగ్గరే ఉన్నారని సమాచారం అందింది. పోలీసులను చూడగానే మావోయిస్టులు ఫైరింగ్ చేశారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. మృతి చెందిన ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా మావోయిస్టులు ఉన్నారా ? అనుమానంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.