పిఎఫ్ ఖాతాదారులకు షాక్…8ఏళ్ల కనిష్ఠానికి వడ్డీ రేట్లు తగ్గింపు

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 02:06 PM IST
పిఎఫ్ ఖాతాదారులకు షాక్…8ఏళ్ల కనిష్ఠానికి వడ్డీ రేట్లు తగ్గింపు

Updated On : March 5, 2020 / 2:06 PM IST

ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

పీఎఫ్‌ వడ్డీరేటు కుదింపుపై నేడు సమావేశమైన ఈపీఎఫ్‌వో  సెంట్రల్ ట్రస్టీల బోర్డు (CBT) ఈ తుది నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియా తెలిపారు. కాగా ఇది ఎనిమిదేళ్లలో కనిష్ట వడ్డీ రేటు కావడం గమనార్హం. దీంతో పీఎఫ్ అకౌంట్‌పై సబ్‌ స్క్రైబర్లకు తక్కువ వడ్డీ రానుంది.  పీఎఫ్‌ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా  నిర్ణయం ఈపీఎఫ్‌వోలోని  60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది.