Neem Products : వేపఉత్పత్తులతో పంటలనాశించే చీడపీడలు నిర్మూలన

వేప చేదుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉండటం కారణంగా మొక్కలు చేదు ఎక్కుతాయి. ఈ క్రమంలో మొక్కలను చీడపురుగులు ఆశించడానికి వీలుండదు.

Neem Products : వేపఉత్పత్తులతో పంటలనాశించే చీడపీడలు నిర్మూలన

Neem Tree

Updated On : January 5, 2022 / 12:35 PM IST

Neem Products : పర్యావరణ సమతుల్యము దెబ్బతినకుండా పంటలను ఆశించే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి వాటివలన పంటలకు ఏ విధమైన నష్టము వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో నివారించుకోవాలి. వేప నూనె, వేప పిండి రైతులకు  ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. వేపనూనె వినియోగించడం ద్వారా పైరును చీడపీడలు నుంచి కాపాడవచ్చు. దీంతో రసాయన మందుల వాడకం తగ్గుతుంది. ఇలాంటి పద్దతుల వల్ల సాగు ఖర్చులు కూడా కలిసొస్తాయి.

వేపలో ఉండే చేదు గుణం వల్ల చీడపీడలు మొక్కలను ఆశించటాన్ని నివారించవచ్చు. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించడం ద్వారా పంటకు మేలు చేకూరుతుంది. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి కలుపుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

పండ్లతోటల్లో ఈ వేపనూనెను ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు వేలాడదీయాలి. ఇలా చేయడం ద్వారా వేపనూనె వేరు ద్వారా మొక్కకు చేరుకుంటుంది. వేప ఉత్పత్తులు వ్యవసాయంలో ఎరువుగా, ధాన్యం నిల్వకు బాగా ఉపకరిస్తాయి. వేపలో లిమినియిడ్స్ అనే రసాయనాలు ఉన్నాయి. పంటలను నాశనం చేసే అనేక కీటకాలను అదుపుచేయటంలో వేప ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి.

వేప చేదుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉండటం కారణంగా మొక్కలు చేదు ఎక్కుతాయి. ఈ క్రమంలో మొక్కలను చీడపురుగులు ఆశించడానికి వీలుండదు. అదేవిధంగా వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. . చెప్తున్నారు నిపుణులు.పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో వేపనూనె దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రైతుల పెట్టుబడిలో చాలా ఖర్చు కలిసి వస్తుంది.

వేపనూనె, కషాయం తయారీ ;

వేపగింజలను చెట్టు నుండి సేకరించి 12 గంటలపాటు నానబెట్టి తరువాత ఆరబెట్టాలి. గింజల్లో తేమ శాతం తగ్గాక గోనె సంచుల్లో నింపుకుని భద్రం చేసుకోవాలి. వేపగింజలనుండి పలుకులను వేరు చేసి గ్రౌండర్ లో వేసి కొద్దిగా నీటిని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దానిని గుడ్డలో మూటకట్టుకుని గంట తరువాత ఆమూటను నొక్కతుంటే వేపనూనె బయటకు వస్తుంది.

వేపకషాయానికి సంబంధించి వేప ఆకుల పొడిని ఒకలీటరు నీటికి 50గ్రాముల మొత్తాన్ని తీసుకుని రోజంతా నానబెట్టి తరువాత రోజు వడపోసి అందులో సబ్బుపొడిని కలిపాలి. అనంతరం దానిని పంటలపై పిచికారి చేసుకుంటే పురుగుల ఉధృతి తగ్గుతుంది.