యువతిపై మాజీ ఆర్మీ జవాన్ అత్యాచారం..నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 09:08 AM IST
యువతిపై మాజీ ఆర్మీ జవాన్ అత్యాచారం..నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్

Updated On : September 4, 2020 / 10:13 AM IST

బాద్యతగా మెలగాల్సిన ఓ మాజీ ఆర్మీ జవాన్..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.



నిందితుడు మొహలీ జిల్లాలోని హసన్ పూర్ గ్రామానికి చెందిన సరబ్ జిత్ గా గుర్తించారు. 2018లో చండీఘర్ లోని సెక్టార్ 15లో 27 ఏళ్ల యువతి సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటోంది. సోషల్ నెట్ వర్కింగ్ లో సరబ్ జిత్ తో పరిచయమైంది. ఈ క్రమంలో..కొంత డబ్బు కావాలని అతని అడిగినట్లు, సెక్టార్ 17 బస్టాండ్ వద్ద కలవాలని సరబ్ చెప్పాడని యువతి తెలిపింది.
https://10tv.in/this-cat-got-a-job-in-the-hospital/
2018 మార్చిలో మణిమజారాలోని..ఓ హోటల్ కు తీసుకెళ్లి, ఏదో డ్రింక్ ఇచ్చాడన్నారు. అనంతరం సరబ్ జిత్, అతని స్నేహితుడు అత్యాచారం చేశారన్నారు. అభ్యంతకరమైన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడని తెలిపింది. 2018 జులైలో Amritsarలో మరోసారి అత్యాచారం చేశాడని తెలిపింది.



ఈ చిత్రాలను తన కాబోయే భర్తకు షేర్ చేయడంతో…తన నిశ్చితార్థం ఆగిపోయిందని యువతి వెల్లడించింది. నిందితుడు మరోసారి బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధిత యువతి తెలిపింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.