Goa Politics : కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం కాంగ్రెస్ పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం

Goa (1)
Goa Politics గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం కాంగ్రెస్ పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం లుయీజిన్హో ఫలేరో(70) ఇవాళ(సెప్టెంబర్-29,2021)తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగాల్ రాజధాని కోల్ కతాలో మమతా బెనర్జీ మేనల్లుడు,టీఎంసీ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి పార్టీ కండువా కప్పి.. ఫలేరోను టీఎంసీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గోవా నుంచి బెంగాల్‌కు వచ్చిన ఫలేరో ముందుగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జితో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
టీఎంసీలో చేరిన సందర్భంగా లుయీజిన్హో ఫలేరో మాట్లాడుతూ.. గోవాకు మమతా బెనర్జీ నాయకత్వం అవసరం ఉందని, అందుకే తాను టీఎంసీలో చేరినట్లు తెలిపారు. గోవాకి నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి.. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించందన్నారు. గోవా సంస్కృతి, అక్కడి భిన్నత్వం.. ఇప్పుడు చాలా ప్రమాదంలో పడిందని.. తాను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నానని అన్నారు.
ALSO READ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ ఓనర్
కాగా, 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ 13 స్థానాలకు పరిమితమైంది. అయినా ఇండిపెండెంట్‌లు, ఇతర చిన్న పార్టీలతో కలిసి బీజేపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక,ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు ఆ పార్టీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ బాధ్యతను తన మేనల్లుడికి అప్పగించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. గోవాపై కూడా టీఎంసీ దృష్టిసారించింది. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తుందని, ముఖ్యమంత్రి అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామని ఇటీవల గోవా పర్యటనకు వచ్చిన టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఫలేరో టీఎంసీలో చేరడం ఆ పార్టీకి బూస్ట్‌ను ఇస్తుందనే చెప్పవచ్చు.
ALSO READ రాహుల్ ఉన్నంతకాలం బీజేపీకి ఇబ్బందే లేదు
గోవా రాజకీయాల్లో ఫలేరో బలమైన నేత. మిజోరాం, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వ్యూహాలు, పొత్తుల వెనుక ఫలేరోదే కీలకపాత్ర. 2013లో కర్ణాటక ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గానూ ఆయన వ్యవహరించారు. గోవా ఎన్నికల సమన్వయ కమిటీకి ఇటీవలే ఫలేరోను అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్. అయితే అంతలోనే ఫలేరో నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
ALSO READ గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్