ఫేస్‌బుక్ పొరపాటు: కశ్మీర్ ప్రత్యేక దేశమా?

  • Published By: vamsi ,Published On : March 28, 2019 / 02:27 AM IST
ఫేస్‌బుక్ పొరపాటు: కశ్మీర్ ప్రత్యేక దేశమా?

Updated On : March 28, 2019 / 2:27 AM IST

పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా… పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య వివాదాలకు కారణం అవుతున్న కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఫేస్‌బుక్ చేసిన తప్పును నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావిస్తూ ఓ బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. ఇవాళ ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన 513పేజ్‌లను, గ్రూపులను ఫేస్‌బుక్ పాలసీలకు అనుగుణంగా తీసేశామంటూ ఫస్‌బుక్ బ్లాగ్‌లో వెల్లడించింది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చిన ఫేస్‌బుక్.. నెటిజన్‌లు అలర్ట్ చేయడంతో తప్పును గుర్తించి క్షమించండి పొరపాటు జరిగింది అంటూ క్షమాపణలు చెప్పింది. అలాగే ఇరాన్, రష్యా, మకెడోనియాలలో  2,632 పేజ్‌లను, గ్రూపులను ఫేస్‌బుక్ రిమూవ్ చేసినట్లు ప్రకటించింది.