Father Killed Daughter : ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కూతురును హత్య చేసిన తండ్రి

ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Father Killed Daughter : ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కూతురును హత్య చేసిన తండ్రి

Father Killed Daughter

Updated On : August 28, 2022 / 8:09 PM IST

Father Killed Daughter : ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలాచూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. అయితే మృతురాలికి వారం రోజుల్లో పెళ్లి జరుగాల్సి ఉంది. బాబుగఢ్‌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మహ్మద్ ఫరియాద్‌కు ఆరుగురు సంతానం. రెండో కుమార్తె రేష్మను తండ్రి మహ్మద్ ఆహారం అడిగాడు.

అయితే ఆహారం వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో కుమార్తెపై అతడు అరిచాడు. ఈ క్రమంలో రేష్మ కూడా తండ్రికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన ఫరియాద్‌ గడ్డిని కత్తిరించే బ్లేడ్‌తో కూతురిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రేష్మ రక్తం మడుగుల్లో పడి అక్కడికక్కడే మృతి చెందింది.

Mother And Daughter Killed : ప్రకాశం జిల్లాలో తల్లి,కూతురు దారుణ హత్య

చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న రేష్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా, 22 ఏళ్ల రేష్మకు సెప్టెంబర్‌ 4న పెళ్లి జరుగాల్సి ఉందని స్థానికులు తెలిపారు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్లాల్సిన అమ్మాయి తండ్రి చేతిలో చనిపోవడంపై కుటుంబంతోపాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.