Shopian‌ : జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

Shopian‌ : జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

Shopian‌

Updated On : October 1, 2021 / 11:17 AM IST

Shopian‌ : జమ్మూకాశ్మీర్ షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. గాలింపు బృందాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

Read More :  హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?

ఈ కాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందాడు. అతడు ఏ సంస్థకు చెందినవనే విషయం ఇంకా తెలియరాలేదని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఉగ్రవేట కొనసాగుతోందని తెలిపారు. బందిపొరలో గత ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి.

Read More :   ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు