Unregistered Drones: డ్రోన్లను అక్రమంగా వాడితే రూ.25వేల నుంచి రూ.5లక్షల ఫైన్

యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిష్ట్రీ లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అన్‌నేమ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (యూఏఎస్) రూల్స్ 2021 ప్రకారం.. గుర్తింపు లేని సంస్థల ద్వారా తయారైన డ్రోన్స్ ఎగరేస్తే దాదాపు రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకూ ఫైన్..

Unregistered Drones: యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిష్ట్రీ లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అన్‌నేమ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (యూఏఎస్) రూల్స్ 2021 ప్రకారం.. గుర్తింపు లేని సంస్థల ద్వారా తయారైన డ్రోన్స్ ఎగరేస్తే దాదాపు రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకూ ఫైన్ తప్పదని చెప్పింది. డ్రోన్ ఆపరేటర్లు వారు ఎగరేసే డ్రోన్లు కచ్చితంగా ఆథరైజేషన్ ఉండేలా జాగ్రత్త పడాలి.

పేరులేని ఎయిర్ క్రాఫ్ట్ లు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు ఎయిర్ పోర్టుల నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఎగరడానికి వీల్లేదు. ఏదైనా సివిల్, ప్రైవేట్ లేదా డిఫెన్స్ ఎయిర్ పోర్టుల నుంచి 3కిలోమీటర్ల దూరం వరకూ డ్రోన్ తిరగడానికి వీల్లేదు.

దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ డ్రోన్ ఇండస్ట్రీకి స్టాండర్డ్స్ ఏర్పాటు చేయడమనేది మంచి విషయమని డీజీసీఏ ఎన్టీఆర్ఓ రేజస్ జాబ్ అంటున్నారు. యూఏవీ ఎకోసిస్టమ్ ను పటిష్టంగా ఏర్పాటు చేసిన కొత్త రెగ్యూలేషన్స్ బూస్టింగ్ చేస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. సరైన పర్మిషన్ లేకుండా డ్రోన్లు ఎగిరితే మాత్రం రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకూ ఫైన్లు తప్పనిసరిగా చెల్లించాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు