ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం : దీన్‌దయాల్ భవన్‌లో మంటలు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ భవన్ లోని సీజీవో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం(మార్చి-6) ఉదయం 8.30గంటల ప్రాంతంలో 5వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాలు అన్నీ ఈ కాంప్లెక్స్ లోనే ఉన్నాయి. పర్యావరణ శాఖకు చెందిన విభాగంలో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో దర్యాఫ్తు చేపట్టారు. గతంలో ఈ బిల్డింగ్ ను పర్యావరణ్ భవన్ గా పిలిచేవారు. ఇది 11 అంతస్తుల భవనం.
#Visuals: Fire breaks out on the 5th floor of Pandit Deendayal Antyodaya Bhawan at CGO Complex; 24 fire tenders present at the spot. #Delhi pic.twitter.com/5csHdEfMiU
— ANI (@ANI) March 6, 2019