Fire Breaks Out : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదాలు…పలువురికి గాయాలు
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు....

Fire Breaks Out
Fire Breaks Out : దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బాణసంచా మార్కెటులో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గోపాల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో రెండు మోటారు సైకిళ్లు, 12 దుకాణాలు కాలిపోయాయి. దుకాణాలను మంటలు చుట్టుముట్టడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ALSO READ : Delhi Thick Smog : దీపావళి ఎఫెక్ట్, ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు వస్త్రాల దుకాణాలు దగ్ధమయ్యాయి. మహారాష్ట్రలోని శుక్రవార్ పేట ప్రాంతంలోని గోదాముల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం వల్ల ఆస్తినష్టం సంభవించింది. జమ్మూకశ్మీరులోని కుప్వారా జిల్లా మాతా శార్దాదేవి దేవాలయంలో అగ్నిప్రమాదం జరిగింది.
ALSO READ : Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్…అయిదుగురి మృతి
ఆలయంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలగించి పూజలు చేస్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోనే దీపావళి సందర్భంగా వంద అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆదివారం రాత్రి 6 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు 200 అగ్నిప్రమాదాలు జరగ్గా మంటలను సకాలంలో ఆర్పామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు.