ఫస్ట్ టైమ్ : ఏఐఎంసీ నేషనల్ సెక్రటరీగా ట్రాన్స్ జెండర్ అప్సరా 

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 03:30 AM IST
ఫస్ట్ టైమ్ : ఏఐఎంసీ నేషనల్ సెక్రటరీగా ట్రాన్స్ జెండర్ అప్సరా 

Updated On : January 9, 2019 / 3:30 AM IST

ఢిల్లీ : అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే మొదటిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చేసిన అప్సరారెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐఎంసీ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. బాలలపై లైంగిక దాడులు, తదితర సామాజిక అంశాలపై అప్సరారెడ్డి కృషి చేస్తు న్నారు. ఇంతకుముందు ఆమె బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల్లో పని చేశారు. మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డిని స్వాగతిస్తున్నట్లు సుస్మితాదేవ్ తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ కుటుంబంలో అప్సరారెడ్డిని సభ్యురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి స్పందిస్తూ అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ర్టాఅఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే మొదటిసారి.