భారతదేశ ఆశలు చిన్నాభిన్నం.. 30ఏళ్ల దిగువకు జారిపోయిన వృద్ధిరేటు

కరోనా దెబ్బకు భారతదేశం లాక్‌డౌన్ ప్రకటించడంతో వృద్ధిరేటున 5.1శాతం నుంచి 2శాతానికి తగ్గించింది Fitch Ratings. ఇది 30 ఏళ్లలో ఇది అతితక్కువ వృద్ధిరేటు. ఎదుగుబొదుగూ లేని ఈ రేటును హిందూ వృద్ధిరేటుగా ఒకనాడు ప్రపంచం పిలిచేది. కరోనా వ్యాప్తితో ప్రపంచమే ఆర్ధికమాంద్యంలోకి జారిపోతోంది. మనతోపాటు చైనాయే కాస్త బెటర్. మిగిలిన దేశాల వృద్ధిరేటు సున్నాయే. మరికొన్నిదేశాలకు నెగిటీవ్.
చైనా లాక్‌డౌన్‌తో ప్రపంచానికి సప్లయ్ చైన్ తెగిపోయింది. పోనీ ఇదంతా ఆసియాకు సంబంధించిన వ్యవహారమనుకొంటే, ఐరోపానే కరోనా కాటువేయడంతో యావత్త ప్రపంచమే ఎక్కడికక్కడే ఆగిపోయింది. చైనా పరిశ్రమలు పనిచేయడం మొదలుపెట్టినా, ఎవరికి, ఏం సప్లయ్ చేయాలన్నది చైనా ఇష్టం. అంటే మనుకు కావాల్సింది చైనా ఇవ్వదు. తనకు లాభమనుకున్నదాన్నే సప్లయ్ చేస్తుంది. ఇది మరోసమస్య.
ఈ పరిస్థితుల్లో ఆర్దిక వృద్ధిరేటు గురించి ఆశించలేం. ఉన్నది నిలబడితే చాలనుకొంటోంది ప్రపంచం. Fitch Ratingsకి ఆ మాత్రం ఆశకూడా లేదు. ఈతరం ఈ యేడాది, ప్రపంచ ఆర్ధికమాంద్యాన్ని చూస్తుందని, దాని ప్రభావం భారత్ మీద చాలా ఎక్కువగానే ఉంటుందన్నది Fitch Ratingsమాట. అందుకే ఏకంగా 2శాతానికి వృద్ధిరేటును తగ్గించింది. మార్చి 20న Fitch భారతదేశ జీడీపీ వృద్ధిరేటును 5.1గా అంచనావేసింది. 2019 డిసెంబర్ నాటి అంచనా 5.6శాతం.
ఇంతకీ భారతదేశంలో దెబ్బతినే రంగాలేంటి? ఫిట్చ్ దగ్గర సమాధనముంది. చిన్న, మధ్యతరహా సంస్థలు, పరిశ్రమలతోపాటు, సేవారంగానికి పెద్ద దెబ్బతగులుగుతుందని అంచనావేసింది. ప్రజల కొనుగోలు శక్తితగ్గిపోయినప్పుడు.. సరుకులను కొనేదెవ్వరు?
Also Read | ఏపీలో ఎస్మా చట్టం: అతిక్రమిస్తే జైలు.. జరిమానా!