Madhya Pradesh: ఇదేం రూలు? ఆవులను వీధుల్లో వదిలేస్తే చెప్పుదెబ్బలు విధిస్తారట

పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.

Madhya Pradesh: ఇదేం రూలు? ఆవులను వీధుల్లో వదిలేస్తే చెప్పుదెబ్బలు విధిస్తారట

Updated On : July 21, 2023 / 7:50 PM IST

Slaps with Slipper: దేశ చట్టాలు, ప్రభుత్వ పనితీరు ఒక రకంగా ఉంటే.. గ్రామ స్థాయిల్లో పాలన మరొక రకంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడు పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. పోలీస్ స్టేషన్, కోర్టు అని తిరక్కుండా.. చట్టంతో సంబంధం లేకుండా అక్కడికక్కడే వారికి తోచిన రీతిలో తీర్పులు ఇస్తుంటారు, ఆదేశాలు జారీ చేస్తుంటారు, నిబంధనలు పెడుతుంటారు. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు.

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన కర్ణాటక.. పార్లమెంటుకు సోనియా వెళ్లేది అక్కడి నుంచేనట!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నాగనడుయి గ్రామంలో ఇలాంటి ఒక వింత ఆదేశాలు జారీ చేశారు ఆ గ్రామ సర్పంచ్. అదేంటంటే.. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.


సర్పంచ్ ఆదేశాలను ఉద్యోగులు ప్రజలకు తెలియజేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉద్యోగులు డప్పు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ ఈ శిక్ష గురించి చెప్తుండటం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే గ్రామస్థులు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించాలని కోరారు. స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వీరికి మద్దతుగా నిలిచారు.