Flight Passengers: విమానంలో మందుబాబుల వీరంగం.. మద్యం మత్తులో సిబ్బందిపై తిట్ల దండకం
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్‌లో ఏడాది పాటు పని చేసి, ఇండియా తిరిగొస్తున్నారు.

Flight Passengers: విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా దుబాయ్-ముంబై మధ్య ప్రయాణిస్తున్న ఒక విమానంలో కూడా ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. మద్యంమత్తులో విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు.
London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్‌లో ఏడాది పాటు పని చేసి, ఇండియా తిరిగొస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టు (డ్యూటీ ఫ్రీ)లో మద్యం కొనుక్కున్నారు. తర్వాత విమానంలో మద్యం తాగుతూ రచ్చ చేశారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై విమాన సిబ్బంది వారిని హెచ్చరించారు. మద్యం తాగొద్దని సూచించారు. అయినా, ఆ ఇద్దరూ వినిపించుకోలేదు. విమాన సిబ్బందిని కూడా తిట్టారు.
CM KCR: తెలంగాణ రైతుల్ని మేమే ఆదుకుంటాం.. ఎకరానికి పదివేలు ఇస్తాం: సీఎం కేసీఆర్
ఎలాగోలా వారి దగ్గరి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విమానంలో రభస సృష్టించిన ఇద్దరిపై విమాన సిబ్బంది సీఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సహర్ పోలీస్ట స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 336, 21, 22, 25 కింద కేసు నమోదు చేశారు. దీంతో ప్రయాణికులు విమానం దిగిన వెంటనే వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అయితే, బుధవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. కాగా, విమానంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది.