CM KCR: తెలంగాణ రైతుల్ని మేమే ఆదుకుంటాం.. ఎకరానికి పదివేలు ఇస్తాం: సీఎం కేసీఆర్

గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం.

CM KCR: తెలంగాణ రైతుల్ని మేమే ఆదుకుంటాం.. ఎకరానికి పదివేలు ఇస్తాం: సీఎం కేసీఆర్

CM KCR: అకాల వర్షాల వల్ల తెలంగాణలో పంట నష్టపోయిన రైతుల్ని తమ ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించదని, తామే ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తాం అన్నారు. ఇటీవలి వర్షాలకు పంట నష్టపోయిన జిల్లాల్లో సీఎం కేసీఆర్ గురువారం పర్యటిస్తున్నారు.

London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్

దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం. గతంలో ఎవరూ ఇంత నష్టపరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాం. సమస్యలు ఉన్నాయని చెప్పినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కేంద్ర బీమాతో రైతులకు ఒరిగేది ఏమీ లేదు. పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపదల్చుకోలేదు.

Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం

గతంలో పంట నష్టంపై నివేదికలు ఇచ్చినా ఆదుకోలేదు. మా రైతులను మేమే ఆదుకుంటాం. వ్యవసాయరంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం కానీయం. దేశంలో కొత్త వ్యవసాయ పాలసీ రావాలి. పంట నష్టం విషయంలో కేంద్రం ఇచ్చే డబ్బులు సరిపోవు. కేంద్రానికి చెబితే దున్నపోతు మీద వానపడ్డట్లే. ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది. రైతులు నిరాశకు గురికావొద్దు. రైతులకు లాభం చేకూర్చే బీమా కంపెనీలు లేవు. ఉచిత కరెంటు అందిస్తున్నాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.