రాజకీయ హత్య: విచారణను సీబీఐకి అప్పగించిన సీఎం

  • Published By: vamsi ,Published On : March 27, 2019 / 04:12 AM IST
రాజకీయ హత్య: విచారణను సీబీఐకి అప్పగించిన సీఎం

Updated On : March 27, 2019 / 4:12 AM IST

దేశవ్యాప్తంగా ఎన్నికల గడువు ముందుకొస్తున్నవేళ ఒడిశాలో రాజకీయ హత్య చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర బహెరా హత్య ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కేంఝర్ జిల్లా ధకోటిలో ఘషిపుర అసెంబ్లీ స్థానానికి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బెహరా.. ఈసారి అధికార బీజేడీలో చేరేందుకు సిద్ధం అవుతుండగా.. కొందరు దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు.

సోమవారం రాత్రి ధకోట గ్రామంలో రాత్రి 10.30 గంటల సమయంలో బహెరా ఇంటికి చేరుకున్న 10 మంది దుండగులు.. ఆయనను బయటికు తీసుకుని వెళ్లారు. అనుమానం వచ్చిన అతని కుటుంబసభ్యులు బెహరా కోసం గాలించగా.. ఊరి చివర కాళ్లు చేతులు నరికేసి బెహరాను పడేసి ఉన్నారు. తీవ్ర రక్తస్రావం బెహరా పరిస్థితి విషమింగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే బెహరా ఆసుపత్రిలో చనిపోయాడు. ఇదిలా ఉంటే రాజకీయంగా ఈ హత్య ఒడిశాలొ వాద ప్రతివాదనలకు ఆజ్యం పోసింది.  బీజేడీలో బహెరా చేరికతో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని స్థానిక ఎమ్మల్యే ఈ పని చేయించారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు బెహెరా హత్యకేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు.