Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు అస్వస్థత..ఎయిమ్స్ కి తరలింపు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.

Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు అస్వస్థత..ఎయిమ్స్ కి తరలింపు

Manmohan

Updated On : October 13, 2021 / 7:14 PM IST

Manmohan Singh మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(88) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. జ్వరం మరియు బలహీనతతో ఇబ్బంది పడుతున్న మన్మోహన్ సింగ్ ను వెంటనే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్ కి ట్రీట్మెంట్ జరుగుతోంది.

అయితే మన్మోహన్ సింగ్ కు రెండు రోజుల నుంచే జ్వరం ఉందని..ఇవాళ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయనను ఎయిమ్స్ కు తరలించినట్లు సమాచారం.

కాగా, మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడి ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్న విషయం తెలిసిందే. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.

ALSO READ వెంకయ్య అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం..ధీటుగా బదులిచ్చిన భారత్