ఏపీకి ఊరట: కేంద్ర సాయం రూ.900 కోట్లు మంజూరు

  • Published By: chvmurthy ,Published On : January 29, 2019 / 10:55 AM IST
ఏపీకి ఊరట: కేంద్ర సాయం రూ.900 కోట్లు మంజూరు

Updated On : January 29, 2019 / 10:55 AM IST

ఢిల్లీ : ఏపీ కి కరువు సాయం కింద కేంద్రం రూ. 900.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్దాయి కమిటీ  మంగళవారం సమావేశమై  ఈ నిర్ణయం తీసుకుంది. ఈ  సమావేశంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,రాధా మోహన్ సింగ్ పాల్గోన్నారు. 2018-19 లో దేశంలో ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన 6 రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి  కేంద్రం రూ.7214.03 కోట్ల ఎన్డీఆర్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది
వీటిలో….. 
హిమాచల్ ప్రదేశ్ కు రూ.317.44 కోట్లు
ఉత్తరప్రదేశ్ కు రూ.191.73 కోట్లు
గుజరాత్ కు రూ.127.60 కోట్లు
కర్ణాటక కు రూ.949.49 కోట్లు
మహారాష్ట్ర కు రూ.4,714.28 కోట్లు
పుదుచ్చేరి కి రూ.13.09 కోట్లు కేంద్ర కేటాయించారు.
కాగా ….. ఏపీ కి కేంద్రం  నుంచి  రూ.లక్షా 16 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి  తెలిపారు.