Supreme Court : ఆడ, మగ లింగ నిర్ధారణకు జననేంద్రియాలే అంతిమం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం-1954పైనే వాదనలు వింటామని పేర్కొన్నారు.

Supreme Court
Supreme Court ఆడ, మగ లింగ నిర్ధారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మనిషిని ఆడా లేదా మగా అని నిర్ణయించే విషయంలో జననేంద్రియాలే అంతిమం కాదని స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ విషయంలో మనిషి మానసిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్లపై మంగళవారం (ఏప్రిల్ 18)న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివాహం అనేది సామాజిక అంశమని, ఇది ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం పార్లమెంట్ కే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. స్వలింగ వివాహాలకు అనుమతిస్తే మతపరంగా కల్లోలం చెలరేగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Transgender Right :జైళ్లలో ట్రాన్స్‌జెండర్ల హక్కులకు కాపాడటానికి చర్యలు తీసుకోండి : కేంద్రం సూచనలు
అయితే, ఈ వాదనను సీజేఐ చంద్రచూడ్ వ్యతిరేకించారు. తాము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం-1954పైనే వాదనలు వింటామని పేర్కొన్నారు. ఈ చట్టం ఆడ, మగ మధ్య వివాహమని వర్ణించిందన్నారు. ఆడ, మగ లింగ నిర్ధారణకు జననేంద్రియాలే అంతిమం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు స్వలింగ వివాహాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని జమాతే ఉలేమా ఇ హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. స్వలింగ వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులకు బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డకు తండ్రి ఎవరు? సీఆర్పీసీ చట్టం ప్రకారం వారిలో మహిళ ఎవరు? ఆ బిడ్డ మెయింటనెన్స్ ఎవరు చూస్తారు? ఇది సామాజికంగా చాలా సీరియస్ సమస్య అని వెల్లడించారు.
Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త
సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ భారత పౌరులందరికీ రాజ్యంగం ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తున్నట్లైతే వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు ఉన్నట్లేనని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు ఎస్ కే కౌల్, ఎస్ఆర్ భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ విననుంది.