Tattoo Risks: టాటూస్ వేయించుకుంటున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్..

టాటూలు వేయించుకోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా హెచ్ఐవీ..

Tattoo Risks: టాటూస్ వేయించుకుంటున్నారా.. అయితే, మీకు షాకింగ్ న్యూస్..

Tattoo

Updated On : March 2, 2025 / 2:18 PM IST

Tattoo Risks: పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవటాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. తమకు ఇష్టమైన వారి పేర్లు జ్ఞాపకంగా కొందరు.. ఇష్టమైన సింబల్స్ ను ఇంకొందరు టాటూలుగా వేయించుకుంటారు. కొందరు చేతులు, కాళ్లు, భుజాలు.. గుండెలపై టాటూలు వేయించుకుంటే.. కొందరు ఒళ్లంతా టాటూలతో నింపేసుకుంటారు. ఇటీవల కాలంలో టాటూస్ వేసుకోవటం ఒక ట్రెండ్ గా కూడా మారిపోయింది. అయితే, టాటూస్ వేయించుకునే వారిని ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది.

Also Read: Senior Heroins : వామ్మో.. సీనియర్ హీరోయిన్స్ మాస్ డ్యాన్స్ తో రీల్.. మీనా, సంగీత, మహేశ్వరి వైరల్..

టాటూలు వేయించుకోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా హెచ్ఐవీ, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు అన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టాటూల ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై కొత్త నిబంధనలు తీసుకురావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. టాటూకు ఉపయోగించే ఇంకు దుష్ర్పభావం చూపుతుందని ఆయన అన్నారు. అంతేకాదు.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

Also Read: అమ్మా, నాన్న సారీ.. నా చావుకు అతడే కారణం.. సెల్ఫీ వీడియో తీసి ప్రేమికుడి ఇంట్లో యువతి బలవన్మరణం..

టాటూ పార్లర్లను నియంత్రించే చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని దినేశ్ గుండూరావు అభిప్రాయడ్డారు. ఇటీవల చర్మ క్యాన్సర్, హెచ్ఐవీ, చర్మ రోగాలు, హైపటైటిస్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు పెరుగుతున్నాయని, ఇందుకు పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవటం ఒక కారణమని ఆరోగ్య శాఖ జరిపిన పరీక్షల్లో తేలిందని తెలిపాడు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టాటూల కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కుప్పలుతెప్పలుగా టాటూ పార్లర్లు వెలుస్తున్నాయి. టాటూ లేకపోతే అదొక నామోషీగా కూడా కొందరు యువత ఫీలవుతున్న పరిస్థితి.

 

ఒకప్పుడు.. ఒంటిమీద ఏదో ఒక చిన్న టాటూను తమకు నచ్చిన వారి పేరు లేదా తమ జ్ఞాపకాల కోసం వేయించుకునే వారు. కానీ, ప్రస్తుతం కొందరు యువకులు ఒంటి నిండా టాటూలు వేయించుకుంటున్నారు. దీన్ని ఫ్యాషన్ గా ఫీలవుతున్నారు. గతంలో కూడా టాటూ వేయించుకునేటప్పుడు అందులో ఉపయోగించిన ఇంకు కారణంగా ఓ వ్యక్తి హెచ్ఐవి బారిన పడినటువంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో టాటూలు వేయించుకునే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాటూలకు దూరంగా ఉంటే మరీ మంచిదని పలువురు వైద్యులు తెలియజేస్తున్నారు.