మోదీ సంక్రాంతి కానుక : ఉద్యోగులకు జీతాల పెంపు

ఉద్యోగులకు కేంద్రం సంక్రాంతి కానుక
ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం అంగీకారం
మినిమమ్ సేలరీ రూ.18 వేల నుండి 26 వేలకు పెంపు
ఢిల్లీ : సంక్రాంతి పండుగకు కేంద్రం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 15న అంగీకారం తెలిపింది. 29,264 మంది టీచర్లు ప్రత్యక్షంగాను..3.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ అకాడమిక్ స్టాఫ్..ప్రభుత్వ ఎయిడెడ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ కు ఈ సిఫార్సుల ఇంప్లిమెంటేషన్ తో ప్రయోజనం జగనుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
ఈ వేతనాల పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.1,241 కోట్లు అదనపు భారం పడనుందని..2016 జనవరి 1వ తేదీ నుంచి 2019 మార్చి 31 వరకు 50 ఎరియర్స్‌ను చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. మరోవైపు ఫిబ్రవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌లో వేతన పెంపు ఎలా ఉంటున్నదానిపై 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనుంటంతో వేతన పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్న తరుణంలో కేంద్ర ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 18,000 నుంచి రూ.26,000కు పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టీచర్ల సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలు ఉండగా, దాన్ని రూ. 26 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2.57 రెట్లుగా ఉన్న ఫిట్ మెంట్ ను 3.68 రెట్లకు పెంచాలని కూడా వారు కోరుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపుపై కేంద్రం సానుకూల నిర్ణయమే తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్ లో నిర్ణయం ఉంటుందని దాదాపు 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశతో ఉన్నారు.