Passenger Trains : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు పునరుద్దరణ, ఇక నుంచి స్టేషన్ లోనే టికెట్లు
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...

Passenger Trains
Passenger Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కనున్నాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. అంతేకాదు.. ప్యాసింజర్ రైలులో ప్రయాణం కోసం ఇక నుంచి స్టేషన్‌లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు.
రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. కర్ణాటక రాయచూరు వరకు రైళ్లు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే. రైళ్లలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంది. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు ధరించాలంది. భౌతిక దూరం పాటించాలని సూచించింది. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలంది. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయనున్నారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.
కరోనా కారణంగా సాధారణ రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రం నడుపుతోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ రైళ్ల ప్రయాణాలను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.